ప్రజలు అనారోగ్యానికి గురవ్వకుండా ఉండాలంటే.. ఇంటితోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు.. పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. కరోనా సోకకుండా జాగ్రత్త వహించాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల వైరస్ బారిన పడకుండా ఉండగలమని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ సక్రమంగా చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్