విజ్ఞాన, విహార యాత్రలు చేసేవాళ్లు సందర్శించేందుకు వీలుగా... యోగ్యమైన పర్యటక కేంద్రంగా కళకళలాడిన సరళాసాగర్ సాగునీటి ప్రాజెక్టు ఇప్పుడు గండి పడి కన్నీరు పెడుతోంది. ఆసియాలోనే ఆటోమాటిక్ సైఫన్ వ్యవస్థతో నడిచే ఏకైక ప్రాజెక్టుగా నిలిచిన జలాశయం గండి పడి రైతులకు, మత్స్యకారులకు ఆవేదన మిగిల్చింది.
అధికారులు నిర్లక్ష్యం వల్లే గండి పడిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ విపత్తు జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరద నీరు మదనాపురం-ఆత్మకూరు ప్రధాన రహదారిపైకి చేరడంతో మదనాపురం-ఆత్మకూరు రోడ్డులోని వంతెనపైకి నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇదీ చూడండి: వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి... వృథాగా పోతున్న నీరు