నెలలు గడుస్తున్నా వనపర్తి జిల్లా కొత్తకోటలో శిలాఫలకాలు వేసిన నిర్మాణ పనులు ప్రారంభించట్లేదని భాజపా ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కొద్ది నెలల క్రితం రూ. 20 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి కలిసి శిలాఫలకాలకు పూజలు చేశారు.
ఇప్పటివరకు ఎక్కడా పనులు ప్రారంభించకపోవడంపై భాజపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పనులు ప్రారంభించాలని పాదయాత్ర చేపట్టారు.
ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు