జూరాల ప్రాజెక్ట్ గేట్ల దగ్గర మరో మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ప్రమాదంలో గల్లంతైన పాప కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. ఈనెల 17న నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల నుంచి కురువపురం వెళ్తున్న పుట్టి కృష్ణా నదిలో పంచదేవుపాడు వద్ద మునిగింది. ఆ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు.
బుధవారం రెండు మృతదేహాలు దొరికాయి. ఇవాళ మరొకరి లభించింది. ఇంకా దొరకని చిన్న పాప కోసం వెతుకుతున్నారు. జలాశయంలో నీటి ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా గాలింపు చర్యలకు కష్టమవుతోంది.
ఇదీ చూడండి : తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి