కరోనా నియంత్రణ కోసం ప్రజలు మరో 2 వారాల పాటు ఇదే సహకారాన్ని అందిస్తూ.. స్వీయ నియంత్రణ పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు.
వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని మంత్రి పేర్కొన్నారు. జిల్లా నుంచి దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన 10 మందికి సైతం కరోనా లేదని స్పష్టంచేశారు. ముందు జాగ్రత్తగా వారందరినీ క్వారంటైన్‌లో ఉంచామని.. మరో వారం పాటు వారిని క్వారంటైన్‌లోనే ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
జిల్లాలో రేపటి నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. మామిడి, ఇతర పండ్ల పంటలు రైతులు వారికి నచ్చిన మార్కెట్లలో అమ్ముకొనేందుకు అనుమతులు ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి రూ. 2 లక్షల చెక్కును మర్చంట్ అసోసియేషన్ తరఫున మంత్రి నిరంజన్‌రెడ్డి అందజేశారు.
ఇవీ చూడండి: కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయండి: ఉత్తమ్