వనపర్తి జిల్లాలో పర్యటించిన అకున్ సబర్వాల్ కొత్తకోట మండలం అమడబాకులలో కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శ్వేతామహంతితో కలిసి పరిశీలించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం సేకరణ వివరాలు తెలుసుకున్నారు. తూకాలు పూర్తైన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చూడండి : 'నేను మళ్లీ గెలిచానో... చైనా పని అంతే!'