వనపర్తి జిల్లాలోని 52 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ కోసం మంత్రి నిరంజన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు సరఫరా చేసేందుకు, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇతర కార్యక్రమాలకు వాడుకునేందుకు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
పలు పంచాయతీలలో నిధులు లేని కారణంగా వారికి బ్యాంకు రుణం మంజూరు చేయించి.... ట్రాక్టర్లను అందిస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 197 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు తీసుకునేందుకు ఇప్పటికే నిధులు సమకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వ రావు, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి...'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి