వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై పక్కింటి యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 8న మధ్యాహ్నం బాలిక ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించన యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికి చెప్పొద్దంటూ బాలికను బెదిరించాడు.
మూడు రోజుల తర్వాత కడుపునొప్పితో బాధపడుతున్న కూతురిపై తల్లికి అనుమానమొచ్చి బాలికను నిలదీయగా విషయం తెలిసింది. వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవడం చేత రెండు కుటుంబాల పెద్దలు పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. ఇటీవల ఇరు కుటుంబాల మధ్య మాట పట్టింపు రావడంతో యువకుడిపై బాలిక తల్లి గోపాల్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామన్ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి : బంగాల్లో 'అంపన్' విధ్వంసం- 12 మంది మృతి