ETV Bharat / state

'దుర్గంధం భరించలేం... డంపింగ్​ యార్డును తొలగించండి'

తమ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్​ యార్డును వెంటనే తొలగించాలంటూ పరిగి మున్సిపల్​ పరిధిలోని మల్లేమోని గూడ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. డంపింగ్​ యార్డు ఏర్పాటు చేయడం వల్ల గ్రామమంతా దుర్గందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

villagers protest to remove dumping yard in vikarabad district
డంపింగ్​ యార్డును తొలగించాలంటూ గ్రామస్థుల ఆందోళన
author img

By

Published : Jun 25, 2020, 8:44 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లేమోని గూడ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ డంపింగ్ యార్డును తమ గ్రామ శివారు నుంచి తొలగించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. మున్సిపల్ సంబంధిత చెత్త వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. తమ గ్రామ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల గ్రామమంతా దుర్గందంగా మారిందని, గ్రామ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

డంపింగ్ యార్డులోని చెత్త తిని ఇప్పటికే రెండు పశువులు మృతి చెందాయని అన్నారు. వెంటనే డంపింగ్ యార్డు గ్రామ శివారు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: చితకబాదారు: ఉద్యోగస్తులపై కార్పొరేట్ సంస్థ పైశాచికత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.