ETV Bharat / state

వికారాబాద్​లో ఎవరికీ కరోనా సోకలేదు : ఎస్పీ నారాయణ - corona effect in telangana

వికారాబాద్​లో ఎవ్వరికి కరోనా వైరస్​ సోకలేదని జిల్లా పోలీస్​ అధికారి నారాయణ తెలిపారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 30 మంది పరిశీలనలో ఉన్నారని స్పష్టం చేశారు.

vikarabad sp narayana says that no one is effected with corona in their district
వికారాబాద్​లో ఎవరికీ కరోనా సోకలేదు : ఎస్పీ నారాయణ
author img

By

Published : Mar 17, 2020, 10:15 AM IST

వికారాబాద్​ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్స్​లోని కరోనా వైరస్​ ఐసోలేషన్​ సెంటర్​లో 30 మంది అబ్జర్వేషన్​లో ఉన్నారని ఎస్పీ నారాయణ తెలిపారు. ఈ 30 మంది 7 దేశాల నుంచి వచ్చిన వ్యక్తులని స్పష్టం చేశారు.

వీరిని 14 రోజులు పరిశీలనలో ఉంచి వైరస్​ పాజిటివ్​ లక్షణాలు కనిపిస్తే గాంధీ ఆసుపత్రికి తరలిస్తామని ఎస్పీ వెల్లడించారు. వికారాబాద్​లో ఎవరికీ కరోనా వైరస్​ సోకలేదని, ప్రజలెవరూ భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలు నమ్మవద్దని, ఎవరైనా వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.