ETV Bharat / state

ఉపాధికి ఊతం.. ప్రభుత్వాల చొరవతోనే ఫలితం - వికారాబాద్‌ జిల్లాలోని పారిశ్రామిక వాడలు

ఆసాంతం గ్రామీణ నేపథ్యం... వికారాబాద్‌ జిల్లా ప్రత్యేకం. అధికశాతం పేదరైతుల కుటుంబాలకు ఈ జిల్లా అడ్డాగా ఉంటుంది. వీరి పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నా సరైన ఉపాధి లభించక పట్టణాలకు వలస పోతున్నారు. ఇప్పటికే ఉన్న రాకంచర్ల, శివారెడ్డిపేట్‌ పారిశ్రామిక వాడలతో పాటుగా మరిన్ని పారిశ్రామల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలని యువత కోరుతున్నారు. దీంతో తమకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని స్థానికులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ భారత్​ ప్రత్యేక’ కథనం.

development of the industry
పరిశ్రమ అభివృద్ధి.. ఉపాధికి ఊతం
author img

By

Published : Jan 4, 2021, 2:00 PM IST

వికారాబాద్‌ జిల్లా యువతీ యువకులు ఉన్నత చదువులు చదువుకున్నా సరైన ఉపాధి లభించక పట్టణాలకు వలస పోతున్నారు. జిల్లాలోనే పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఉపాధి లభిస్తుందని యువత ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాకంచర్ల, శివారెడ్డిపేట్‌ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. మర్పల్లి, తాండూరు మండలాల్లో కొత్తగా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. స్థల గుర్తింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

పూడూరు మండలం రాకంచర్లలో పరిశ్రమలు ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించినా నేటికీ అనుకున్నంత స్థాయిలో ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం చొరవ చూపి ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పెలా అవగాహన కల్పిస్తే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాకపోకలకు ఎంతో వీలు :

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో పూడూరు మండలంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం యోచించింది. రాకంచర్ల గ్రామ శివారులోని సర్వే నంబరు 5లో ప్రభుత్వం పేదల జీవనోపాధికి కేటాయించిన అసైన్డ్‌ భూములను గుర్తించారు. ఈ స్థలం హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో రవాణా పరంగా సౌకర్యంగా ఉంటుందని భావించారు. అన్ని విధాలుగా అనువైన ప్రదేశం కావటంతో పాటు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉండటంతో 2008లో అధికారులు పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఏళ్ల కిందట ఇక్కడ పట్టాలు పొంది భూములు సాగుచేసుకుంటూ జీవనం పొందుతున్న పేదల నుంచి దాన భూములు సేకరించేందుకు చర్యలు తీసుకున్నారు.

మొత్తం 113 ఎకరాలు :

భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. అనంతరం రెవెన్యూ అధికారులు మొత్తం 113 ఎకరాలను తమ ఆధీనంలోకి తీసుకుని పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి అప్పగించింది. దీంతో పరిశ్రమల ఏర్పాటుకు తగిన సదుపాయాలు కల్పించేందుకు ఏపీఐఐసీ ముందుకు వచ్చింది. రూ.30 కోట్లు ఖర్చుపెట్టి తారు రోడ్లు, నీటి సదుపాయం, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు వంటి వివిధ పనులు చేశారు. అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత టీఎస్‌ఐఐసీ పేరుతో అధికారులు బోర్డులు మార్పుచేశారు.

* ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించటంతో ఇక్కడ ఓ సంస్థ యూనిట్‌ ఏర్పాటుకు మొట్టమొదటగా ముందుకు వచ్చింది. నగరంలోని పరిశ్రమల నుంచి పనికిరాని వ్యర్థాలను, పాడైన ఔషధాలను ఇక్కడికి తెచ్చి సిమెంట్‌లో కలిపే కెమికల్‌కు సంబంధించిన రసాయనాన్ని తయారు చేసే పరిశ్రమను స్థాపించింది.. ఇందులో నిత్యం సుమారు 150 నుంచి 200 మంది వరకు పనిచేస్తుండగా వివిధ కేటగిరీల్లో పనిచేసేందుకు కొందరు స్థానికులకు అవకాశం దక్కింది.

* తరువాత అనుమతులు పొందిన మరికొన్ని సంస్థలు ఇటీవల పారిశ్రామిక ప్రదేశంలో షెడ్ల నిర్మాణానికి పనులను ప్రారంభించాయి. ఇలాంటి మరిశ్రమలు మరో 30 వరకు ఏర్పాటుకు అనువైనవిగా భూములు ఉన్నాయి.

* హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌ మండలం కాటేదాన్‌ ప్రాంతంలో ఎంతో కాలంగా కొనసాగుతున్న పరిశ్రమలతో పట్టణం పెరిగి ఇబ్బందులు వస్తుండడంతో పూడూరుకు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అర్హతలను బట్టి పనిచేసేందుకు స్థానికులకు అవకాశాలు కల్పించాలి. పేదలకు ఇచ్చిన భూములు తీసుకున్నారు. భూములు పోయిన వారికి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు. ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకుని ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఒకటి రెండే ఏర్పాటు కావటంతో పనిచేసేందుకు కొంత మందికే అవకాశం దక్కింది. ఇతర పరిశ్రమలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- ఎంఏ జావీద్‌, నిరుద్యోగి, రాకంచర్ల

రాకంచర్లలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కాలుష్యం లేకుండా ప్రజలకు నష్టం కలిగించని వాటినే ఏర్పాటు చేయాలి. ఇక్కడ కేటాయించిన స్థలంలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పడితే పంచాయతీకి అదనంగా ఆదాయం లభిస్తుంది. ప్రజలకు ఉపాధి లభిస్తుంది. నా వంతుగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా.

- కమిలీబాయి, తిరుమలాపూర్‌ సర్పంచ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.