వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నర్సరీలను జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. సయ్యద్ ముల్కాపూర్ గ్రామంలోని నర్సరీ నిర్వహణపై జిల్లా పాలనాధికారి మండిపడ్డారు. మొక్కల మానిటరింగ్, రిజిస్టర్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
అక్కడ ఉన్న లోపాలను గమనించిన కలెక్టర్ నర్సరీ నిర్వహిస్తున్న అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. కొన్ని మొక్కలు ఏపుగా పెరిగినా.. మరికొన్ని ఎందుకు పెరగలేదని ఆరా తీశారు. నల్లకవర్లలో మట్టి నింపిన వాటిలో విత్తనాలు ఎందుకు వేయలేదని అక్కడి సిబ్బందిని జిల్లా పాలనాధికారి పౌసుమి బసు ప్రశ్నించారు.