రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయేనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. వికారాబాద్ జల్లా అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామిని ఆయన దర్శించుకున్నారు.
ప్రస్తుతం అధ్యక్షుడగా బండి సంజయ్ బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. తెరాస రికార్డును బ్రేక్ చేసి భాజపా అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలన, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అటల్ బిహారీ వాజ్‌పేయీ పాలనను తలపిస్తుందని అన్నారు. అందుకే ఆలస్యం చేయకుండా తిరిగి భాజపా సభ్యత్వం తీసుకున్నానని స్పష్టం చేశారు. ప్రతీ భాజపా కార్యకర్తకి తాను చనిపోయినప్పుడు పార్టీ జెండా కప్పుకోవాలనే కోరిక ఉంటుందని అన్నారు.
ఇదీ చూడండి: కుక్కకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు