ETV Bharat / state

మత్స్య పరిశ్రమతో... జీవనోపాధి - వికారాబాద్‌ జిల్లా

కరవు పరిస్థితులతో జీవనోపాధికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఊరట కలిగిస్తోంది. ఈ పరిశ్రమ అభివృద్ధికి... ప్రత్యేకంగా "ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని" తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​  ప్రకటించారు. మత్స్య పరిశ్రమ అభ్యున్నతికి వికారాబాద్‌ జిల్లాలో పలు రాయితీలు అందిస్తున్నారు.

మత్స్య పరిశ్రమతో...జీవనోపాధి
author img

By

Published : Jul 6, 2019, 2:49 PM IST

వికారాబాద్‌ జిల్లాలో పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో 509 చెరువులు ఉన్నాయి. వీటిలో 91 చెరువులు మత్స్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. మిగిలినవి పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో కోటి చేప పిల్లల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నా కరవు విఘాతం కలిగిస్తోంది.

చేపల ఉత్పత్తి
మోమిన్‌పేటలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పునఃప్రారంభించి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తే పరిశ్రమ పూర్వ వైభవం సంతరించుకోనుంది. వివిధ కారణాలతో జిల్లాలో మత్స్య పరిశ్రమ ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించడం లేదు. కట్ల, రోహు, మృగాల, సీసీ వంటి చేపలు జిల్లా వాతావరణానికి అనువైనవి. ఇతర ప్రాంతాల్లో చేపలను కొనుగోలు చేసి పరిగిలో విక్రయిస్తున్నా, లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని కార్మికుల వాపోతున్నారు.

మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేకించి ప్రత్యేక పథకం తీసుకురావడం హర్షణీయం. మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయం చూపుతూనే, మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి. తాలుకా కేంద్రాల్లో దుకాణ సముదాయాలను ఏర్పాటు చేస్తే పలువురికి ఉపాధి లభిస్తుందని మాజీ డైరెక్టర్‌ నర్సింహులు పేర్కొన్నారు.

చేపల చెరువులను తవ్వుకుంటే రాయితీ
కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో జిల్లా మేలు కలుగుతుందని భావిస్తున్నాం. మోమిన్‌పేట చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు చొరవ తీసుకుంటున్నాం. చేపల చెరువులను తవ్వుకునేందుకు జనరల్‌ కేటగిరి వారికి 40శాతం రాయితీ ప్రభుత్వం అందిస్తోంది. యూనిట్‌ వ్యయం రూ.8.5లక్షలు ఉండగా అందులో చెరువు నిర్మాణానికి రూ.7లక్షలు, ఇన్‌పుట్‌ అవసరాలకు రూ.1.5లక్షలు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు అయితే రూ.60శాతం రాయితీ వర్తిస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి దుర్గా ప్రసాద్‌ తెలిపారు.

ఇదీ చూడండి : "వరుణుడి కోసం కడవ పూజ"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.