తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాాబాద్ జిల్లా సుల్తాన్పూర్, నస్కల్, బోంపల్లి గ్రామాల్లో సుమారు వేయి మందికి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు.
ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కార్యకర్తలంతా వారి ఇళ్లలోనే ఆవిర్బావ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అనంతరం సుల్తాన్పూర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.