ETV Bharat / state

'పల్లెలు దేశానికి పట్టుకొమ్మల లాంటివి' - అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నరేందర్​రెడ్డి వార్తలు

కొడంగల్​ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్​ సునీత మహేందర్​రెడ్డిలు పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

The countryside is like a horn of country
'పల్లెలు దేశానికి పట్టుకొమ్మల లాంటివి'
author img

By

Published : Dec 24, 2019, 12:33 PM IST

పల్లెలు దేశానికి పట్టుకొమ్మల లాంటివని ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.40 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు జడ్పీ ఛైర్​పర్సన్​ సునీత మహేందర్​రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

మార్పు అనేది గ్రామాల నుంచే మొదలవ్వాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లో చాలామంది మరుగుదొడ్లు నిర్మించుకున్నా.. వాటిని వినియోగించుకోకుండా బహిరంగ మల విసర్జనలు చేస్తున్నారన్నారు. బహిరంగ మల విసర్జన చేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారి అనారోగ్యాలకు గురవుతారని హెచ్చరించారు.

ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో మధ్య తరగతికి చెందిన ప్రజలు సంవత్సరానికి రూ. 10 వేలకు పైగా ఆస్పత్రులకు చెల్లిస్తున్నట్లు తేలిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు బహిరంగ మలవిసర్జన మానుకుని మరుగుదొడ్లను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్​కుమార్ గౌడ్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, తెరాస నాయకులు మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

'పల్లెలు దేశానికి పట్టుకొమ్మల లాంటివి'

ఇవీ చూడండి: 330 స్టాళ్లతో పుస్తకాల ప్రదర్శన

Intro:వికారాబాద్ జిల్లా ను సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా తీర్చిదిద్దు కుందాం: జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి

Body:వికారాబాద్ జిల్లా ను సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా తీర్చిదిద్దు కుందాం : జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి

Conclusion:పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు లాంటివని వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.... సోమవారం కొడంగల్ నియోజకవర్గం లోని దౌల్తాబాద్ మండలం లో 40 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మార్పు అనేది ముఖ్యంగా గ్రామాల నుంచి వస్తేనే అది పట్టణాలకు చేరి మార్పు సాధ్యం అవుతుందని తెలిపారు... చాలామంది గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న వాటిని వినియోగించుకోకుండా అందులో వస్తువులు సామాన్లు వేసి పంచుకుంటున్నారని తెలిపారు... బహిరంగ మల విసర్జన చేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారి గ్రామంలోని ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో మధ్య తరగతికి చెందిన ప్రజలు సంవత్సరానికి పది వేల రూపాయలకు పైగా ఆస్పత్రులకు చెల్లిస్తున్నారని తెలిపారు ఇది కేవలం పారిశుధ్యం లోపించడంతో పాటు బహిరంగ మల విసర్జన చేయడం వల్ల అంటువ్యాధులు ఏర్పడి అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు అందుకోసం ప్రతి ఒక్కరు మరుగుదొడ్ల ఏర్పాటు చేసుకొని బహిరంగ మలవిసర్జన సంపూర్ణంగా నిషేధించాలని తెలిపారు.... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ప్రజలందరూ తమ అవసరాల కోసం అడవులను నరికివేసి ఉండడంవల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు... ఢిల్లీ బొంబాయి నగరాల్లో కాలుష్యంతో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు అని తెలిపారు అక్కడి ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం మార్కుల చుట్టూ ఇతర ప్రాంతాలకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని తీసుకుంటున్నారని తెలిపారు.... ఢిల్లీ ముంబై రాష్ట్రంలోని వృద్ధులు చిన్న పిల్లలు గర్భిణీలు అనేక శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు అందుకోసం మనం కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయకపోతే భవిష్యత్తులో ఢిల్లీ-ముంబై రాష్ట్రం ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొనే ఢిల్లీ ముంబై రాష్ట్ర ప్రజలు లాగే మనం కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని తెలిపారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పర్యావరణ సంరక్షణ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో పాటు ఎం పి పి విజయ్ కుమార్ గౌడ్ జడ్పిటిసి కోట్ల మహిపాల్ తెరాస నాయకులు మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.