వికారాబాద్ జిల్లా తాండూరులో పురపాలక ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద తెరాస, భాజపా మధ్య గొడవ జరిగింది. పట్టణంలోని 24వ వార్డు 70, 71, 72 పోలింగ్ కేంద్రాల్లో తెరాస నాయకులు గ్రామాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని భాజపా నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనితో పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు.
దీనితో అక్కడ కొంత సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓటు వేయడానికి గ్రామాల నుంచి వచ్చిన వారిని భాజపా నాయకులు పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- ఇవీ చూడండి: హలో ఓటర్.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!