ETV Bharat / state

తాండూరు మున్సిపల్​ ఛైర్​పర్సన్ ఎమ్మెల్సీ ఓటుపై గందరగోళం - telangana mlc elections news

ఈ నెల 14న జరిగిన మహబూబ్‌నగర్​-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో ఓ తెరాస మున్సిపల్​ ఛైర్​పర్సన్​ దొంగ ఓటు వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తన తోటికోడలు ఓటును తన ఓటుగా వినియోగించుకున్నారని కాంగ్రెస్​ నేతలు ఎన్నికల కమిషనర్​కు ఫిర్యాదు చేశారు.

Tandoor Municipal Chairperson cast a fraudulent vote in the MLC elections
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాండూరు మున్సిపల్​ ఛైర్​పర్సన్ దొంగ ఓటు ​
author img

By

Published : Mar 19, 2021, 5:09 PM IST

మహబూబ్‌నగర్​-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ (తెరాస) దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన తోటికోడలు పేరుతో నమోదైన ఓటును.. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న తన ఓటుగా వేశారంటూ పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్వప్న దొంగ ఓటు వేశారంటూ కాంగ్రెస్​ నేతలు ఎన్నికల కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో విచారణ చేపట్టిన కలెక్టర్‌.. స్వప్న దొంగ ఓటు వేసినట్లు నిర్ధారించారు.

ఫలితంగా స్వప్నకు వ్యతిరేకంగా బల్దియా కార్యాలయం ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. స్వప్న తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

మరోవైపు ఓ ప్రజాప్రతినిధి దొంగ ఓటు వేయడంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఓటరు ఇంటి పేరు, ఛైర్​పర్సన్​ స్వప్న ఇంటి పేరు ఒకటే కావటం వల్ల ఆమె ఎవరికీ అనుమానం రాకుండా ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి: తికమక పెట్టే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఎలా చేస్తారో తెలుసా..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.