వికారాబాద్ జిల్లా పరిగి జన్ సాహాస్ స్వచ్ఛంద సంస్థ కాలినడకన తమ ప్రాంతాలకు వెళ్తున్న వలస కార్మికులకు అండగా నిలిచింది. వారికి భోజన సౌకర్యం కల్పించింది. అలాగే వారు వెళ్లాల్సిన బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు... స్థానిక డీఎస్పీ శ్రీనివాస్‌తో మాట్లాడి రవాణా సౌకర్యం కల్పించినట్లు సంస్థ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.
వలస కూలీలను పంపించేందుకు సుదీక్ష పాఠశాల ఛైర్మన్, మాజీ జడ్పీటీసీ చంద్రయ్య బస్సులు ఏర్పాటు చేశారు. వలస కార్మికులకు మాస్క్‌లతోపాటు ప్రయాణంలో తినేందుకు పండ్లు పంపిణీ చేశారు.