అన్ని రకాలుగా అర్హుడైన తనకు పింఛను మంజూరు చేయడం లేదని వికారాబాద్‌కు చెందిన సన్యాల శంకరయ్య కలెక్టర్ పౌసుమీ బసును కోరాడు. తన దయనీయ పరిస్థితిని వివరించారు. గతంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని వాపోయాడు. తన భార్య వ్యవసాయ కూలి పనులు చేసి తనను పోషిస్తోందని శంకరయ్య పేర్కొన్నాడు.
2018లో సదరం క్యాంప్‌లో పరీక్షించిన వైద్యులు 52 శాతం అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. 43 ఏళ్ల శంకరయ్య ఎటూ వెళ్లి పనులు చేసుకోలేని పరిస్థితి. పూట గడవడం కష్టంగా ఉందని, పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని శంకరయ్య కోరుతున్నాడు.
ఇదీ చూడండి: ఆ విద్యార్థులకు మంత్రులు కేటీఆర్, సబిత ప్రశంసలు