వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. తాండూరు పోలీస్ సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, గ్రామీణ పట్టణ సీఐల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
పట్టణంలోని మొత్తం 22 ఎరువుల దుకాణాల్లో పోలీసులు, వ్యవసాయ అధికారులు తనిఖీలు చేశారు. దుకాణాలతోపాటు గోదాంలను సైతం అధికారులు పరిశీచలించారు. ఎరువుల విక్రయాలకు సంబంధించిన రశీదులు, ధరలు, దుకాణాల లైసెన్సులు, నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన వాటిపై ఆరా తీశారు.
ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు:
ఎరువు మందులకు సంబంధించిన రశీదులను రైతులకు తప్పకుండా ఇవ్వాలని వ్యాపారులను అధికారులు ఆదేశించారు. కంపెనీలు నిర్దేశించిన ధరలకు మాత్రమే ఎరువులు అమ్మాలని ,ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించిన గడ్డి నివారణ మందును ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మరాదని సూచించారు. దిగుబడి రాకుంటే విత్తనాలు ఇచ్చిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా