డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణీ ప్రాణాలు విడిచింది. వికారాబాద్ పట్టణంలోని "సద్గురు సాయిరాం హాస్పిటల్"లో వైద్యం వికటించి నిండు గర్బిణి మృతి చెందింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రేపల్లికి చెందిన గర్భిణీ మజీత బేగం డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. ఆపరేషన్ చేస్తున్న సమయంలో బ్లీడింగ్ ఎక్కువై మృతి చెందడంతో.. ఆ కుటుబంలో విషాదం నెలకొంది.
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమే మృతి చెదిందంటూ.. హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వారిని అదువు చేసి.. కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చూడండీ : తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్య