వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలోని సత్యధామం దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శృంగేరి పీఠం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామీ ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త దుర్గాప్రసాద్ తెలిపారు. రామసహిత సత్యనారాయణ స్వామీ ఆలయం "తెలంగాణ అన్నవరం"గా విరాజిల్లుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఫలసమర్పణం, గురుప్రార్థన, గణపతి పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సామూహిక వ్రతాలను బుధవారం సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని... స్వామీ వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు.
ఘనంగా సత్యధామం దేవాలయ ప్రథమ వార్షికోత్సవం - telangana annavaram
బిల్కల్ గ్రామంలోని సత్యధామం దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సామూహిక వ్రతాలను రేపు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.