ETV Bharat / state

ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో ప్రధాని మోదీ ఫొటో - modi photo in telangana mlc election voter list

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో ప్రధాని మోదీ ఫొటో దర్శనమిచ్చింది. ఓటర్​ లిస్టులో వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పరిధిలోని పులుసుమామిడి గ్రామానికి చెందిన దయాకర్​ రెడ్డి పేరు వద్ద అతని ఫొటోకు బదులు ప్రధాని మోదీ ఫొటో ప్రింట్ అయింది.

pm modi photo in telangana graduate mlc election voter list 2021
ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో ప్రధాని మోదీ ఫొటో
author img

By

Published : Mar 15, 2021, 9:49 AM IST

ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో ప్రధాని మోదీ ఫొటో దర్శనమిచ్చింది. సదరు ఓటరు ఓటుహక్కు వినియోగించుకోనివ్వరనే అనుమానంతో పోలింగ్‌ కేంద్రానికే రాలేదని అతని సన్నిహితులు తెలిపారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్‌ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన పట్టభద్రుడు ఎ.దయాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నారు.

బూత్‌ నంబర్‌ 307లో వరుససంఖ్య 269లో ఆయన ఓటు నమోదై ఉంది. దయాకర్‌రెడ్డి ఫొటో ఉండాల్సి నచోట ప్రధాని మోదీ ఫొటో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఓటరు జాబితాలో ఉన్న ఫొటోతో సంబంధం లేదని పేరు, ఇతర వివరాలు సరిగ్గా ఉన్న ఆధారాలు చూపిస్తే ఓటు వేసేందుకు అనుమతిస్తామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.