అది వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం. తెల్లవారుజాము 4 గంటలు అవుతుంది. అక్కడ వందల మంది క్యూలో ఉన్నారు. ఓ వైపు చలి.. మరో వైపు ఆధార్ కేంద్రం ఎప్పుడు తీస్తారా అని
ఆత్రుత. ఇందుకు కారణం రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులే.. అదేలా అంటారా.. రేషన్ పంపిణీకి ప్రభుత్వం ఐరిస్, మొబైల్ ఓటీపీ విధానాన్ని ఈనెల నుంచి అమలు చేయబోతోంది.
ఐరిస్‌తో రాకపోతే మొబైల్ ఓటీపీతో రేషన్ పంపిణీ చేస్తారు. కాని గ్రామాల్లోని సుమారు 30 శాతం మందికి ఆధార్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోలేదు. ఇప్పడు వారంతా మీసేవా, బ్యాంకులు, ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. చంటి పిల్లలను చంకలో వేసుకుని వణికే చలిలో నిరీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: ఏరోఇండియా షో వేదికగా నేడు 'తేజస్' కొనుగోలు ఒప్పందం