ప్రభుత్వం ప్రకటించిన జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ప్రజలందరూ ఇండ్లల్లోనే ఉండాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు సూచించారు. జిల్లా ఎస్పీ నారాయణతో కలిసి కరోనాపై నియంత్రణ కోసం... సోమవారం వికారాబాద్‌లో స్వీయ నిర్బంధ రోజును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
సోమవారం సైతం జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలన్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించామని... వారిని ఇళ్లలో ఉంచి పూర్తి నిఘా ఉంచామని తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్లు : 040-256998, 256996 ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చూడండి : కరోనా వైరస్‌ను ఓడిద్దాం...