ETV Bharat / state

'అభివృద్ధిని చూసే తెరాసకు రైతులు పట్టం కట్టారు' - Parigi MLA Mahesh Reddy Latest News

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసే రైతులు సహకార ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పట్టం కట్టారని పరిగి ఎమ్మెల్యే మహేశ్​ రెడ్డి అన్నారు. వికారాబాద్ కుల్కచర్లలో సహకార సంఘం ఛైర్​పర్సన్​, వైస్ ఛైర్​పర్సన్​ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

PACS CHAIRPERSON
PACS CHAIRPERSON
author img

By

Published : Feb 16, 2020, 9:15 PM IST

దేశానికి వెన్నుముక లాంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత సహకార సంఘాల పాలకవర్గాలదేనని పరిగి ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి తెలిపారు. వికారాబాద్ కుల్కచర్లలో సహకార సంఘ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఛైర్మన్​గా బుయ్యని మనోహర్ రెడ్డి, వైస్ ఛైర్మన్​గా నాగరాజు ఎన్నికయ్యారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే రైతులు సహకార ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించారని... రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా డైరక్టర్లు పని చేయాలని సూచించారు. జిల్లా ఛైర్​పర్సన్ పదవి కుల్కచర్ల మండలానికి రావడం హర్షనీయమన్నారు. రైతులకు సేవ చేసే అదృష్టం లభించిందని... కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల కోసం శాయశక్తులా పనిచేస్తానని నూతన ఛైర్​పర్సన్ మనోహర్ రెడ్డి అన్నారు.

కుల్కచర్లలో సహకార సంఘ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం

ఇదీ చదవండి : 'గ్రీన్​ ఛాలెంజ్​ స్వీకరించిన టీసీఎస్​ వైస్​ ప్రెసిడెంట్​'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.