వికారాబాద్ జిల్లా పరిగి పురపాలిక పరిధిలోని రోడ్లు నిర్మాణ పనులను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. రూ.1.4 కోట్ల మున్సిపల్ నిధులతో వీటిని చేపడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి టెలిఫోన్ భవన్ వరకు, అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు రహదారులను నిర్మించనున్నారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను.. ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ ఛైర్మన్ ముకుందా అశోక్, కో- ఆప్షన్ సభ్యుడు ముకుంద శేఖర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవీచూడండి: డ్రగ్స్: వ్యసనం.. వ్యాపారం.. అరెస్ట్