ETV Bharat / state

ఊహా చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువకుడు! - తెలంగాణ వార్తలు

సృజనాత్మకత ఉండాలి కానీ బండరాయి కూడా అత్యద్భుత శిల్పంగా మారుతుంది. చిత్రకారుడి ఆలోచనను బట్టి ఒక్కో వస్తువులో ఒక్కో ఆకారం కనిపిస్తుంది. ఇక తనలోని అందమైన ఊహలకు అపురూపమైన చిత్రాలను గీస్తున్నారు ఓ యువ చిత్రకారుడు.

panither ashok, vikarabad district painter ashok
అద్భుత చిత్రాలు గీస్తున్న అశోక్, వికారాబాద్ జిల్లా చిత్రకారుడు
author img

By

Published : Apr 18, 2021, 2:00 PM IST

చిత్రకారుడి చేతిలోని ఏ వస్తువైనా అద్భుత కళాఖండంగా మారుతుంది. తన ఆలోచనలకు అందమైన రూపాన్ని ఇచ్చి ఔరా.. అనిపిస్తున్నారు ఓ యువకుడు. విరిగిపోయిన సుద్దముక్కలను అందమైన బొమ్మలుగా మలుస్తున్నారు. చింత గింజలపై ఎన్నో అపురూప చిత్రాలు గీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆయనే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్​కు చెందిన అశోక్.

అశోక్​కు చిన్నప్పటి నుంచి చిత్రాకళపై ఆసక్తి ఉండేది. తనలోని ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించారని తెలిపారు. చిన్న చిన్న పరికరాలతో మొదలుపెట్టి ప్రస్తుతం ఏదైనా అద్భుతంగా మలిచే స్థాయికి ఎదిగారు.

panither ashok, vikarabad district painter ashok
చిత్రకారుడు అశోక్

తెలంగాణ తల్లి, బతుకమ్మ ఎత్తిన మహిళలు, గిరిజన మహిళలు ధరించే వస్త్రాలు, ఆంజనేయుడు, చింత గింజలపై 30కిపైగా దేశాల చిత్రాలు గీసి ఔరా అనిపించుకున్నారు. ఉప్పు బిస్కెట్లపై వివిధ మతాలకు చెందిన చిత్రపటాలు గీశారు.

ఎప్పటికైనా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నా. ఆర్థికంగా వెనుకబడిన తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి. తనకు సహకరిస్తే ఎంతో మంది చిన్నారులకు ఈ కళను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా.

-అశోక్, చిత్రకారుడు

ఇదీ చదవండి: సోషల్‌మీడియా శ్రీమహాలక్ష్ములు.. మిలియన్లలో ఫాలోవర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.