వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండలం అడవి వెంకటాపూర్ గ్రామానికి చెందిన కట్రావత్ అనూష అంతర్జాతీయ ఖోఖో జట్టులో స్థానం సంపాదించింది. చిన్నప్పటి నుంచి తనకు ఆటలపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు... ప్రోత్సహించడం మొదలు పెట్టారు. తల్లిదండ్రులిచ్చిన ధైర్యంతో ఖోఖోలు రాణిస్తూ... అంతర్జాతీయ స్థాయి వరకూ వెళ్లింది. ప్రస్తుతం భారత ఖోఖో జట్టు తరఫున ఇంగ్లండ్ వేదికగా జరిగబోయే ఆసియా ఖోఖో ఛాంపియన్షిప్కి ఎంపికైంది.
పరిగిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అనూష ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు దాగున్నాయి. ఆరో తరగతి నుంచి ఖోఖో ఆడటం మొదలు పెట్టిన అనూషయ... జాతీయ జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ సౌత్ జోన్ టోర్నీలన్నింటిలో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఇటీవల సీనియర్ నేషనల్ టోర్నీలో రాష్ట్ర ఖోఖో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది.
పుట్టింది మారుమూల గిరిజిన తండాలోనే అయినా రాష్ట్రవ్యాప్తంగా తన పేరును వినిపిస్తున్న అనూష... ఎంతో మంది గిరిజన బాలికలకు ఆదర్శం.
ఇవీ చూడండి: 'సింగపట్నం' పిలుస్తోంది... 'సింగోటం' రారమ్మంటోంది!