వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వికలాంగులకు మూడు చక్రాల మోటారు వాహనాలు, బదిరులకు 4జీ స్మార్ట్ ఫోన్లు, అంధులకు స్మార్ట్ చేతి కర్రలు, ల్యాప్‌టాప్‌లు, బ్రెయిలీ కిట్లను ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిలు కలిసి ఉచితంగా అందించారు. ఎంపీ నిధులతో దివ్యాంగులకు కావాల్సినవి ఉచితంగా ఇచ్చినట్లు రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలవనుందని ఆయన అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ సర్కారు వికలాంగులకు సాయపడుతోందని కేంద్రం అవార్డు కూడా ఇచ్చిందని ఎంపీ తెలిపారు. సకలాంగులు... వికలాంగులను పెళ్లి చేసుకుంటే రూ. లక్ష ప్రోత్సాహకాలు అందిస్తున్నామని రంజిత్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లలో 5 శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నామన్నారు.
ఇదీ చదవండిః ప్రభుత్వం అండగా ఉంటుంది: రంజిత్‌రెడ్డి