వికరాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మార్వో అశోక్‌కుమార్ ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని.. వారికి కావాల్సిన అన్ని వసతులు కేసీఆర్ కల్పిస్తున్నారని ఆయన అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతుల గుండెల్లో కేసీఆర్ నిలిచారని కొనియాడారు.
ఇదీ చూడండి: హేమంత్ హత్య కేసు నిందితులకు పోలీసు కస్టడీ