లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోరారు. నియోజకవర్గ పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకై ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులను వారి ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఏదైనా సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, డీఎస్పీ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ