ETV Bharat / state

రైతులను రాజులను చేయడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రి సబిత - మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజా వార్తలు

రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలన కొనసాగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్​ జిల్లా కొడంగల్​ నియోజకవర్గంలో నూతన వ్యవసాయ విధానంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

minister sabitha indrareddy participated in  New Agricultural Policy program in kodangal
రైతులను రాజులను చేయడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రి సబితా
author img

By

Published : Jun 1, 2020, 1:47 PM IST

తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగుతోందని తెలిపారు. వికారాబాద్​ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో నూతన వ్యవసాయ విధానంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

కొవిడ్​-19తో అన్ని రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతుంటే.. తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని మంత్రి పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి ఆదివారం పది నిమిషాల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు సైతం పాల్గొనాలని తెలిపారు. రానున్న రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వివరించారు.

10 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్​రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్​ముఖ్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: వర్సిటీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర: భట్టి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.