నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా చరిత్రకెక్కారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ... వికరాబాద్ జిల్లా పరిగిలో ట్రాక్టర్లతో కృతజ్ఞత ర్యాలీని ప్రారంభించారు.
పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డిలు ట్రాక్టర్లు నడుపుతూ.. ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని మంత్రి సబిత అన్నారు. నూతన రెవెన్యూ చట్టం వల్ల ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన రైతు సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
- ఇదీ చూడండి: బాలు లాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టం!