చార్మినార్ జోన్లో వికారాబాద్ జిల్లాను కలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌కు సూచించారు. ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచుతామని స్పష్టం చేశారు. పదవీ విరమణ వయసు 60 లేదా 61 ఏళ్లకు పెంచనున్నట్టు వెల్లడించారు. పదోన్నతుల విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రమోషన్ల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని సూచించారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టిస్తామని పేర్కొన్నారు. పదోన్నతుల విషయంలో వేసిన కేసులను ఉద్యోగులు ఉపసంహరించుకోవాలని కోరారు. మండల, జడ్పీ సమావేశాల్లో అధికారులు ఉద్యోగులను దూషించడం సహించబోమని హెచ్చరించారు.
ఇదీ చూడండి: పరిశుభ్రమైన గ్రామాల్లో విజయదశమి: కేసీఆర్