కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్తో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న వారిని ఆదుకునేందుకు మాతృభూమి ఫౌండేషన్ ముందుకొచ్చింది.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మంలం అంతారం గ్రామంలో ఈ ఫౌండేషన్ తరఫున.. ఇంఛార్జ్ ఎంవీ బుగ్గయ్య పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దగ్గుల కృష్ణ, ఉప సర్పంచ్ గోపాల్, అఖిల భారత అంబేడ్కర్ యువజన సంఘం వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డమీది వెంకట్ రాములు పాల్గొన్నారు.