వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం తుంకిమెట్ల గ్రామం స్టేజ్ వద్ద గురవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న లారీ ఆ గ్రామ స్టేజి వద్ద బైక్‌పై వెళ్తున్న హైదర్‌ను ఢీ కొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: జయలలితను శోభన్‌బాబు అందుకే దూరంపెట్టారు!