ETV Bharat / state

చిరుత దాడి.. పరిగెత్తిన రైతు - vikarabad district latest news today

చిరుత వరుస దాడులతో ఆ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇటీవల వికారాబాద్​ జిల్లా ఇప్పాయి గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య రైతు లేగదూడపై చిరుత దాడి చేసింది. అరుపులు విని పరిగెత్తుకెళ్లిన రైతును చూసి చిరుత పారిపోయింది. ఈ ఘటన వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మండలంలో జరిగింది.

Leopard attack Running farmer at vikarabad district
చిరుత దాడి.. పరిగెత్తిన రైతు
author img

By

Published : Mar 6, 2020, 7:11 PM IST

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో రైతులకు చిరుత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుత వరుస దాడులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పొలాల వద్ద కట్టేసిన లేగదూడలపై దాడి చేసి చంపుతోంది. తాజాగా ఇప్పాయి గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య రైతు లేగదూడపై చిరుత దాడి చేసింది.

లేగదూడ అరుపులు విని అక్కడికి వెళ్లిన రైతులను చూసి చిరుత పారిపోయింది. కుల్కచర్ల మండలంలో ఏదో ఒక గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక రైతులు, ఊళ్లోని జనాలు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎలాగైనా చిరుతను బంధించి తమ ప్రాణాలు, మూగ జీవుల ప్రాణాలు కాపాడలని రైతులు కోరుతున్నారు.

చిరుత దాడి.. పరిగెత్తిన రైతు

ఇదీ చూడండి : తెలంగాణలో మరో వ్యక్తిలో కరోనా లక్షణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.