నలభై ఏళ్ల కింద నాయనమ్మ చెప్పిన గరీబీ హఠావో... నినాదాన్నే ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారని ఎద్దేవా చేశారు తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పాలమూరు ఆపాలంటూ కేసులు పెట్టిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు... కేసీఆర్ ఆ పథకాన్ని పూర్తిచేయలేదంటూ ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి... పాలమూరు పథకానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి:చౌకీదార్, టేకేదార్ కాదు దేశానికి కేసీఆర్ కావాలి