వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు, రాజకీయాలు, తదితర అంశాలపై రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు తెరాసపై నమ్మకంతో గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చర్చలో మంత్రితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, మహేశ్ రెడ్డి, రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గంలో శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. త్వరలోనే వికారాబాద్, పరిగి, తాండూరు మునిసిపాలిటీల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం