వికారాబాద్ జిల్లా సంజీవ్నగర్లో నిరుపేదలకు కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరకులు అందజేశారు. కేఎస్ఆర్ ట్రస్టు అధినేత శరత్ రెడ్డి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈనెలలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా గ్రామంలోని అందరిని హోమ్ క్వారంటైన్ చేశారు.
కరోనా ప్రభావంతో ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు రాకుండా ఉండటం వల్ల జీవనోపాధి కరువై దాతల కోసం చూస్తున్నారు. దాతలు సహాయం చేయాలని సోషల్ మీడియాలో సర్పంచ్ అశోక్ రెడ్డి కోరగా ఆయన స్పందించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు సైతం నిత్యావసరాలు, కొంత నగదును అందజేశారు.
ఇదీ చూడండి : 'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం.. 50 వేల మందికి పరీక్షలు'