పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా బొంరాస్పేట్ మండలంలోని గౌరారం గ్రామంలో పట్టభద్రులతో ఆయన సమావేశమయ్యారు.
దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి... రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెప్పి... ఎన్నికల్లో గెలుపొందేందుకు కుట్రలు పన్నుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, వాణీదేవి