అప్రమత్తతే కరోనా నుంచి శ్రీరామరక్ష అన్నారు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనాకు బలికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో పలు కేసులు నమోదైనా.. కొడంగల్‌లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని గుర్తు చేశారు. నిర్లక్ష్యం వహిస్తే.. వైరస్ సోకే ప్రమాదముందని, అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష అని, కొడంగల్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లాక్డౌన్ సమయంలో పేదలు, వలస కూలీలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి రూ.1500 ఖాతాల్లో వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కుమార్, వైస్ ఛైర్మన్ ఉషారాణి, తహసిల్దార్ కిరణ్ కుమార్, సిఐ నాగేశ్వరరావు, కౌన్సిలర్ మధుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః ఎన్నికల వాయిదా నుంచి తొలగింపు వరకు... కారణాలెన్నో