వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని కవవాతు మైదానంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సునీతారెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు, పలు పాఠశాలల విద్యార్థులు కవాతు నిర్వహించారు. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలలో భాగంగా 150మంది విద్యార్థులు గాంధీజీ వేశధారణలో కవాతులో పాల్గొని.... భారతదేశ పటం ఆకారంలో కూర్చుని కనువిందు చేశారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని జడ్పీ ఛైర్ పర్సన్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం , ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధుడు నారాయణ దాసును సునీతారెడ్డి జిల్లా కలెక్టర్ అయేషాతో కలిసి సన్మానించారు. వివిధ శాఖల వారిగా శకటాల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు కళారూపాలను ప్రదర్శించారు. జిల్లాలో 34 మందికి ఆపద్బంధు పథకం కింద మంజూరైన 50 వేల రుపాయల చెక్‌లను అందించారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన 159 మంది అధికారులకు అవార్డులను అందజేశారు.
ఇవీ చూడండి:కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు: కేసీఆర్