వికారాబాద్ జిల్లా ధారూరు మండలం మైలారం కొత్త తండాలో భార్యను కిరాతకంగా భర్త హత్య చేశాడు. 13 ఏళ్ల కిందట కిషన్ నాయక్‌కు, లక్ష్మినగర్ తండాకు చెందిన గాంగిబాయితో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలున్న ఈ దంపతులు చిన్న విషయలకూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మళ్లీ గొడవకు దిగారు.
మాటామాటా పెరగడం వల్లే...
ఈ క్రమంలో దంపతుల మధ్య మాటామాటా పెరగడం వల్ల... ఆగ్రహంతో ఊగిపోయిన భర్త గొడ్డలితో భార్యపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని చూసిన స్థానికులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గాంగిబాయి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇవీ చూడండి : భార్య డబ్బులు ఇవ్వలేదని 6నెలల బిడ్డను చంపేశాడు..