'ఎవరెస్ట్ అధిరోహణకు సాయం చేయండి' ఆర్థిక సాయం చేస్తే ఎవరెస్ట్ పర్వతం ఎక్కి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ఇనుమడింప చేస్తానని పర్వతారోహకుడు తిరుపతి రెడ్డి తెలిపారు. వికారాబాద్‌కు చెందిన తిరుపతి రెడ్డి ఆటో డ్రైవర్ కుమారుడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా... పర్వతారోహణను కొనసాగిస్తున్నానని అన్నారు. తెలంగాణ నుంచి 2019లో ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి ఎంపికైనా... అధిరోహణకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దాతలు సాయం చేయాలని విన్నవించారు.
ఇవీ చదవండి:ఓటింగ్‌లో పాల్గొనవద్దు