ETV Bharat / state

వికారాబాద్​ జిల్లాలో భారీవర్షం.. నీట మునిగిన పంటలు - నిలిచిపోయిన రాకపోకలు

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వికారాబాద్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు నీట మునగడం వల్ల పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేరి.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Heavy Rains in Vikarabad , Thandur.. Transportation Delayed
వికారాబాద్​ జిల్లాలో ఆగని వర్షం.. నీట మునిగిన పంటలు
author img

By

Published : Sep 26, 2020, 3:14 PM IST

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో శుక్రవారం కురిసిన వర్షాలకు చెరువులు నిండి అలుగులు పారుతూ.. పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు నుంచి హైదరాబాద్, మహబూబ్​నగర్, జహీరాబాద్​లకు వెళ్లే దారిలో వాగులు పొంగడం వల్ల రోడ్లు పాడై.. రాకపోకలు నిలిచిపోయాయి.

జుంటుపల్లి, శివసాగర్​ జలాశయాలు నిండి అలుగు పారుతున్నాయి. మంబాపూర్, మన్​సాన్​పల్లి , కోకట్ వాగులతో పాటు తాండూరు సమీపంలో కాగ్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాల్లోకి నీరు చేరి.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో పంటలు మునిగి నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: వ్యవసాయ బిల్లుల ఆమోదంతో యార్డుల పాత్ర నామమాత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.