వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. జిల్లాలో కోట్పల్లి, సర్పన్ పల్లి, లక్నాపూర్, శివసాగర్ తదితర ప్రాజెక్టులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి.
కొన్ని చోట్ల కల్వర్టులు కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. జిల్లాలోని అనేక గ్రామాలకు రాకపోకలు రద్దయ్యాయి. వాగులు పొంగుతుండడం వల్ల పంట పొలాల్లోని నీరు చేరడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏలాంటి ప్రమాదాలు జరిగకుండా ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు పోలీసులు వాగుల వెంట గస్తీ నిర్వహించారు.
ఇదీ చూడండి : దంచికొట్టిన వానలు.. పలుచోట్ల తెగిన కుంటలు, రోడ్లు