వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మల్లికార్జున మందిరంలో చోరి జరిగింది. ఉదయం 7 గంటల సమయంలో ఇద్దరు యువకులు గుడిలోకి వచ్చారు. ఒక వ్యక్తి అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా మరో వ్యక్తి చుట్టుపక్కల గమనిస్తూ పక్కన నిలబడ్డాడు. మొదటి వ్యక్తి పూజారిని అర్చన చేయమన్నాడు. 500 ఇచ్చి చిల్లర అడిగాడు. చిల్లరకోసం అర్చకుడు బయటకు వెళ్లాగానే అమ్మవారి విగ్రహం నుండి ముక్కుపుడక , తాళిని దొంగలించి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి:చర్లపల్లి పారిశ్రామికవాడలో ఇంకా ఆరని మంటలు